Teenmar Mallanna: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్న తీన్మార్ మల్లన్న.. అందుకు కారణం సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోవడానికి పునాది వేసింది తానేనని పేర్కొన్నారు.