తెలంగాణలో సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈసారి విద్యార్థులు ఎగిరిగంతేసే శుభవార్త వినిపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. తెలంగాణ దర్శిని పేరుతో విద్యార్థులకు ఈ ఫ్రీ ఎంట్రీని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. దీని వల్ల విద్యార్థులకు పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.