Outside Food Not Allowed In Telangana Hostels: తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలను సర్కారు సీరయస్‌గా తీసుకుంది. ప్రభుత్వం ఆహార భద్రత కమిటీలను నియమించింది. అలాగే సంక్షేమశాఖలు, గురుకుల సొసైటీలు అప్రమత్తతో కొన్ని సూచనలు చేశారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.