రాష్ట్రంలోని 630 మండలాల్లో ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,142.15 కోట్లతో 162 పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆరుట్లలో తొలి టీపీఎస్ను సీఎం రేవంత్రెడ్డి జూన్ 17న ప్రారంభించగా.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక విద్య, క్రీడా సదుపాయాలు కల్పించనున్నారు. వంద మందికి మించి విద్యార్థులున్న హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, మూడు ఇంటరాక్టివ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో రూ.209 కోట్లతో 4,355 శౌచాలయాలను నిర్మించనున్నారు.