తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, భద్రత కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. తాజాగా కొడంగల్‌లో ఉచిత కుట్టుమిషన్లను మహిళలకు పంపిణీ చేశారు. మొత్తం 104 మందికి ఈ మిషన్లను అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు మద్దతు, ఉచిత శిక్షణ కార్యక్రమాలు, బాలికల విద్యా ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా మహిళా సాధికారత సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతి రెడ్డి అన్నారు.