రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఓఎస్డీ ప్రభాకర్ తప్పించుకుని తిరుగుతున్నారు. అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్‌రావు, అరువుల శ్రవణ్‌ను స్వదేశానికి రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో అమెరికాతో ఒప్పందం ఉన్నందున దాన్ని ఇందుకోసం ఉపయోగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.