పదేళ్ల పాటు ప్రధాని పదవి.. అంతకు ముందు ఐదేళ్లు కేంద్ర ఆర్ధిక మంత్రిగా.. దీనికి ముందు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఇలా ఆయన ఏ పదవిలో ఉన్నా.. మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నెమ్మదిగా ఉన్నా.. ఆలోచనలు మాత్రం పాదరసంలా ఉండేది. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు.