Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 17వ తేదీకి కొత్త పేరు పెట్టారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమాలు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో మంత్రులు జెండా ఎగురవేయనున్నట్లు వెల్లడించింది.