TG Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ వంటి వాటిపై ప్రధానంగా తెలంగాణ కేబినెట్ భేటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక రైతు భరోసాపై ఇప్పటికీ అసెంబ్లీలో ప్రకటన చేయడంతో.. తాజా మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది.