తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ-హెచ్‌లో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది సరికొత్త సాంకేతికతతో పరీక్ష ముగిసిన 6 రోజులకే ఫలితాలు ఇవ్వడం విశేషం. పరీక్ష రాసిన వెంటనే స్క్రీన్‌పై మార్కులు చూపే విధానాన్ని ఈసారి అమలు చేశారు. విద్యార్థులు eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు.