TG Police: పుష్ప-2 సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు థియేటర్ వద్ద, లోపల జరిగిన సంఘటనకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టి హెచ్చరికలు చేశారు.