మహానగరంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు కొత్త రూపు రానుంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ కేంద్రాల పేరును 'ఇందిరా క్యాంటీన్'గా మార్చడానికి ఆమోదం లభించింది. కేవలం మధ్యాహ్నం పూట అన్నం అందించడమే కాకుండా, ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా ఐదు రూపాయలకే అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ.. క్యాంటీన్లకు శాశ్వత భవనాలు నిర్మించి, మెరుగైన వసతులు కల్పించాలని సంకల్పించారు. దీంతో పాటు.. నగరంలోని పబ్లిక్ టాయిలెట్ నిర్వహణను 'పే అండ్ యూజ్' పద్ధతికి మార్చుతూ మరో కీలక తీర్మానం చేశారు.