స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల ఆధార్ కార్డుల అప్టేట్ కోసం హైదరాబాద్ జీపీవో సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కోరిక మేరకు నేరుగా స్కూళ్లలోనే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కనీసం 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్, పేరు, ఫోన్ నంబర్ మార్పుల వంటి సేవలు అందిస్తారు. ఇందుకోసం జీపీవో అబిడ్స్ కార్యాలయాన్ని ఫోన్ నంబర్లు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తే 15 రోజుల్లోగా క్యాంప్ ఏర్పాటు చేస్తారు.