తెలంగాణలో 93 వేల మందికి పెన్షన్లు కట్.. కొత్త చేయూత పెన్షన్లపై కీలక అప్డేట్

1 hour ago 2
తెలంగాణలో చేయూత పెన్షన్ల అక్రమాలపై సెర్ప్ చేపట్టిన సర్వే తుది దశకు చేరింది. బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్ పొందే 19 లక్షల మందిలో ఇప్పటివరకు 15.97 లక్షల మంది సర్వే పూర్తి కాగా.. అందులో 93,624 మంది అనర్హులుగా తేలారు. వీరిలో 40,751 మంది మరణించగా.. 41,689 మంది ఆచూకీ లేదు. 11 వేల మంది ఆధార్ చెల్లడం లేదు, 3,475 మంది వలస వెళ్లారు. ఈ నెలాఖరుతో సర్వే ముగియనుండగా.. వచ్చే నెల మొదటి వారం నుండి కొత్త పెన్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
Read Entire Article