తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుండి రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య రవాణాను మెరుగుపరచడానికి 16 గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణాన్ని చేపట్టింది. సమగ్ర మొబిలిటీ ప్లాన్‌లో భాగంగా హెచ్‌ఎండీఏ ఈ భారీ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం రావిర్యాల నుంచి ఆమన్‌గల్ (41 కి.మీ), బుద్వేల్ నుంచి కోస్గి (81 కి.మీ) రహదారుల డీపీఆర్ పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ రహదారులు పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ.. శివార్లలో 3.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఊతమిస్తాయి. 2047 లక్ష్యంగా 11 జిల్లాలను అనుసంధానిస్తూ.. ప్రజల రవాణా కష్టాలను తీర్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ కొత్త రహదారుల వెంట భారీ టౌన్‌షిప్‌లు, లాజిస్టిక్ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి.