విశాఖ టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై శ్రీచరణ్ తల్లి సీతామహాలక్ష్మి తొలిసారిగా స్పందించారు. తన బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదన్నారు సీతామహాలక్ష్మి. తాము విశాఖను వదిలి వెళ్లమని.. తమ బిడ్డ తప్పు చేసినట్లయితే తామే ప్రాణాలు తీసుకుంటామన్నారు. రాధా గాయత్రి దశదినకర్మను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూడా శ్రీచరణ్ రాకపోవటంతో రాధా గాయత్రి తల్లిదండ్రులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.