ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రూ. 78,000 వరకు రాయితీ లభిస్తున్నప్పటికీ.. తెలంగాణలో ఈ పథకం నిరాదరణకు గురవుతోంది. ఇప్పటివరకు కేవలం 19,985 ఇళ్లపైనే సోలార్ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) అమ్మకాలు తగ్గుతాయనే భయంతో శ్రద్ధ చూపకపోవడం, పథకంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణాలు. ఈ అడ్డంకులను తొలగిస్తేనే రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.