వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వాహీద్ అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు సైకోలా మారి, ఇప్పటికే పది మంది అమ్మాయిలపై అత్యాచారం చేసి, ఆ చర్యలను తన సెల్ ఫోన్‌లో వీడియోలు తీసినట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మోమిన్ పేట్ పోలీసులువాహీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో (POCSO) వంటి కఠిన చట్టాలు ఉన్నా ఇలాంటి నేరాలు జరగడం మహిళా భద్రత పై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.