తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా చలానాలు విధించడం సహజం. నిబంధనలను విరుద్ధంగా ఎవరైనా తమ వాహనాలను నడిపితే ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తుంటారు. అయితే.. చలానాలు విధించే క్రమంలో పోలీసులు సొంత మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇలానే ఓ వ్యక్తికి చలానా విధించడంతో.. ఆ బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. సొంత ఫోన్లలో ఫొటో తీసి చలానా విధించడం ఏంటని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది.