హైదరాబాద్‌లో డ్రైవర్లకు బంపర్ ఆఫర్. టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి భారీగా డ్రైవర్లను తీసుకోబోతోంది. హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో అనుభవం ఉన్నవాళ్లకు ఇది మంచి అవకాశం. కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడిపే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.