Tiruapati Natu Sara: గాల్లోకి ఎగిరిన పోలీసుల డ్రోన్.. చెట్టు తొర్రలో ఎలా రా నాయనా

3 hours ago 2
తిరుపతి పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. డ్రోన్స్ తో స్థావరాలను బాకరాపేట పోలీసులు కనిపెట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో నాటుసారా స్థావరాలను కనిపెట్టడానికి అధునాతన డ్రోన్స్ వినియోగించారు. రహస్యంగా చెట్టు తోర్రలో ఉన్న నాటుసారా స్థావరాలను పోలీసులు కనిపెట్టారు. యర్రవారిపాళ్యం మండలంలోని వేములవాడ గ్రామం, తలకోన వాటర్ కెనాల్ వద్ద ఉన్న నాటుసారా స్థావరాలు ఉన్నాయి.. గుట్టుచప్పుకాకుండా చెట్టుతొర్రలో ఉన్న 9 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ముందుగా డ్రోన్ తో స్థావరాన్ని కనిపెట్టిన పోలీసులు.. డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన తర్వాత అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పారిపోతున్న వేముల హనుమంతు, మునిస్వాములను డ్రోన్ గుర్తించింది. బాకరాపేట పోలీసులు వెంటనే వారిని కూడా అరెస్టు చేశారు.
Read Entire Article