Tiruchanur Temple: వారం రోజులే టైమ్.. లేకుంటే ఉద్యమిస్తాం.. బోడె రామచంద్ర యాదవ్

1 year ago 21
తిరుచానూరు సమీపంలోని వారాహి అమ్మవారి ఆలయాన్ని కొద్దిరోజుల కిందట దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారాహి అమ్మవారి ఆలయాన్ని బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పరిశీలించారు. ఇసుక దోపిడీకి అమ్మవారి ఆలయం అడ్డుగా ఉందని ధ్వంసం చేశారని రామచంద్రయాదవ్ ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో మరో రెండు రోజుల తర్వాత నాగలమ్మ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారని మండిపడ్డారు. హిందూ ఆలయాలు, హిందు ధర్మం, హిందూ పండగలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.వారాహి దేవాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి,ప్రభుత్వమే ఆలయం నిర్మించాలని.. ఈ వివాదానికి కారణమైన వారిపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు.
Read Entire Article