తిరుపతి ఎస్వీ గోశాల వ్యవహారం కాకరేపుతోంది. ఈ ఘటనపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భూమన ఆరోపణలకు కౌంటరిచ్చారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. ఆదివారం తిరుపతిలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమనపై బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేకి అయిన భూమన టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా పని చేయడం దురదృష్టకరమని అన్నారు. అసలు ఆయన హిందువే కాదని.. ఆయనవన్నీ వేషాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి తన పిల్లలకు ఏ సంప్రదాయంలో వివాహం చేశారో అందరికీ తెలిసిన విషయమేనంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతూ భూమన కరుణాకర్ రెడ్డి రూ.1600 కోట్లు ఇంజనీరింగ్ వర్క్స్‌కు ఆర్డర్ ఇచ్చారన్న బీఆర్ నాయుడు.. ఈ పనులు పొందిన వారి నుంచి భూమన కమీషన్లు పొందారంటూ టీటీడీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు.