సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. నాలుగు వారాల్లోపు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సిద్ధార్థ రెడ్డి సోమవారం రోజున నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. అనంతరం అతణ్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ సందర్భంగా మిగిలిన కాలం శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది.