ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. ఇమామ్, మౌజమ్‌లకు బకాయిలు విడుదల

1 hour ago 3
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్, మౌజమ్‌లకు రంజాన్ కానుక ప్రకటించింది. ఇమామ్, మౌజమ్‌ల బకాయిలను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు ఇవ్వటం టీడీపీ హయాంలోనే ప్రారంభమైందన్నారు. మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఏపీలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Entire Article