Tirumala Hundi: సిరులు కురిపిస్తోన్న శ్రీవారి హుండీ.. వరుసగా 33వ నెలా..

1 month ago 5
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.100 కోట్లు దాటింది. వరుసగా 33వ నెల కూడా హుండీ ఆదాయం రూ.100 కోట్లకు పైగా నమోదైంది. నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.111 కోట్లుగా అధికారులు తెలిపారు. దీంతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.1253 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ నెల మిగిలే ఉన్న నేపథ్యంలో 2024 ఏడాది గానూ శ్రీవారి హుండీ ఆదాయం రూ.1350 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. మరోవైపు అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో హుండీ ఆదాయం కాస్త తగ్గింది.
Read Entire Article