రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తిరుమల లడ్డూ గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ తయారీలో గతంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ హాట్ టాపిక్‌గా మారింది. ఆరోపణల నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీపై వాస్తవాలు వెల్లడించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ తయారీ ఎప్పుడు ప్రారంభమైంది.. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారనేదీ ఓ సారి పరిశీలిద్దాం.