ఏపీలో తిరుమల లడ్డూ వివాదం ఇంకా చల్లారడం లేదు. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ వైపు నడుస్తోంది. మరోవైపు పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటుడు సుమన్ ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంలో చేసిన ఈ తప్పు.. టెర్రరిజం కంటే ఎక్కువంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని.. కారకులను విడిచిపెట్టొద్టంటూ కోరారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.