AR Dairy Tirumala Laddu Prasadam Police Case Transfer To Sit: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. టీటీడీ ఫిర్యాదుతో కేసు నమోదుకాగా.. ఈ కేసును సిట్‌కు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.