Tirumala Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతీ నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందులో భాగంగానే నేడు టోకెన్లు జారీ చేయనున్నారు. అయితే మొదట వచ్చిన వారికి మాత్రమే టికెట్లు దక్కనున్నాయి. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఈ స్థానిక దర్శన టోకెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ టోకెన్లు జారీ చేసి.. అవి పొందిన వారికి మంగళవారం రోజున దర్శనాలు కల్పించనున్నారు.