Tirumala: ఎయిర్‌పోర్డులో భౌతిక దాడులు!.. వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై భూమన సంచలన వ్యాఖ్యలు

1 year ago 20
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది. టీటీడీ డిక్లరేషన్ మీద వైఎస్ జగన్ సంతకం చేయాల్సిందేనని కూటమి పార్టీలతో పాటుగా కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తిరుమలలో వైఎస్ జగన్ డిక్లరేషన్ మీద టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గతంలో అనేకసార్లు తిరుమలను సందర్శించిన వ్యక్తికి.. ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి ఐదుసార్లు పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదన్నారు. ఒకవేళ కోరితే.. ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్టేనని భూమన హెచ్చరించారు.
Read Entire Article