Tirumala: తిరుమల శ్రీవారి సేవలో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి యూనిట్

1 day ago 1
తిరుమల శ్రీవారిని అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు, కథానాయిక దీపిక పిల్లి, దర్శకులు నితిన్ భారత్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో పండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిలో కూడా మూమీ టీమ్ సందడి చేసింది.. తిరుపతిలో ఉన్న వేల్ రామ్స్ థియేటర్స్ లో సందడి చేసింది. ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించింది. తమ చిత్రానికి ప్రతిచోటా అద్భుతమైన స్పందన వస్తోందని... సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు హీరో ప్రదీప్‍ మాచిరాజు, హీరోయిన్ దీపి. కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
Read Entire Article