Tirumala: తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. తాజాగా చంద్రబాబుతో భేటీ అయిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఈ వ్యవహారాన్ని సీఎం ముందు ఉంచారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పించారు. ఈ విషయాన్ని స్వయంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.