కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకలను లెక్కించే ప్రదేశం పరకామణి. ఈ సేవకు ప్రభుత్వ ఉద్యోగుల కూడా వస్తుంటారు. అత్యంత కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు , సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు జరుగుతుంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడే వారిని విజిలెన్స్ అధికారులు ఇట్టే గుర్తిస్తున్నారు. తాజాగా, ఓ బ్యాంకు ఉద్యోగి తన చేతివాటం ప్రదర్శించి.. ఏకంగా 100 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు.