శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు.. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలలో ఏర్పాట్లపై మంత్రిని నిలదీసిన భక్తుడు అంటూ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పందించింది. భక్తుడి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. భక్తుడి ఫిర్యాదుపై విచారణ జరిపింది. అయితే శ్రీవారి దర్శనానికి సమయం పడుతోందనే కారణంతోనే భక్తుడు అలా ఫిర్యాదు చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.