TTD cancelled Srivari Arjita Kalyanotsavam: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఆగస్ట్ 18న తిరుమలలో నిర్వహించే కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దుచేసింది. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఆగస్ట్ 15 నుంచి మూడురోజుల పాటు తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు, సహస్రదీపాలంకార సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.