TTD Cancelled Arjitha Sevas June 28 Duet To Jyeshtabhishekam: తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు జ్యేష్టమాసంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రాచీన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తోంది టీటీడీ. ఈ జ్యేష్యాభిషేకం కారణంగా ఈ నెల 28న పలు ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది.