తిరుమల పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆ కోనేటి రాయుడిని దర్శించి తరించాలని భక్తులు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అలాగే శ్రీవారికి టీటీడీ నిర్వహించే వివిధ సేవలలో పాల్గొనాలని ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఈ సేవల కోసం కొంతమంది టీటీడీ అధికారిక వెబ్ సైట్ లేదా .. టీటీడీని సంప్రదిస్తే.. మరికొంతమంది మాత్రం దళారులను నమ్మి మోసపోతుంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో మరో మోసం వెలుగుచూసింది. వస్త్రాలంకార సేవ పేరుతో భక్తులను ఓ దళారి మోసగించిన ఘటన బయటపడింది.