సినీ నటుడు విజయ్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కూతురు శ్రీదేవి ఇతర కుటుంబసభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన విజయ్ కుమార్.. దేవుని పిలుపు లేనిదే తిరుమలకు రాలేమని అన్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.