తిరుపతి జిల్లా చోరీకి గురైన.. చేజారిన మొబైల్ ఫోన్ల రికవరీలో మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మూడునెలల వ్యవధిలో మొబైల్ హంట్, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులకు సంబంధించి 13వ విడతలో 510 సెల్‌ఫోన్లను రికవరీ చేయగా బాధితులకు స్థానిక పోలీస్ కవాతు మైదానంలో బుధవారం అందజేశారు. సెల్‌ఫోన్ చోరీకి గురైనవారు 94906 17873 వాట్సప్ నంబరు సద్వినియోగం చేసుకోవాలని, హాయ్ అని పంపితే లింకు వస్తుందన్నారు. ఇదివరకే 12 విడతల్లో రూ.7.56 కోట్ల విలువైన 4,275 సెల్‌ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.