Secunderabad Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ.. బీజేపీ మహిళా నేత మాధవీలత తిరుమల దర్శనానికి వెళ్లారు. సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలులో తిరుపతికి వెళ్లారు. అయితే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే సమయంలో.. రైలులో భజనా కార్యక్రమం నిర్వహించారు. భజన చేస్తూనే రైలు ఎక్కిన మాధవీలత.. తిరుపతి చేరే వరకు ఈ భజనా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.