Tirupati: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. గ్యాస్ సంస్థల కీలక నిర్ణయం..

15 hours ago 1
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం ఆధ్మాత్మిక నగరం తిరుపతిపై పడింది. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో.. తిరుపతిలో19.5 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని పలు గ్యాస్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. శనివారం (మార్చి 7) నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ గ్యాస్ కంపెనీలతో పాటుగా ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నట్లు సమాచారం.
Read Entire Article