టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 76 ఏళ్ల బాలకృష్ణ ప్రసాద్ వేయికిపైగా అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేశారు. కర్ణాటక సంగీతంతో పాటుగా లలిత, జానపద సంగీతంలోనూ ఆయన సుప్రసిద్ధులు, బాలకృష్ణ ప్రసాద్ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రులు, టీటీడీ ఛైర్మన్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.