mobile theft in Ruia Hospital in Tirupati: రాయలసీమకే తలమానికంగా నిలిచే తిరుపతి రుయా ఆస్పతిలో నకిలీ వైద్యుడి నిర్వాకం బయటపడింది. డాక్టర్ వేషంలో తిరుగుతూ ఓ దొంగ.. సెల్ ఫోన్లు కాజేస్తున్న వైనం బయటపడింది. మదనపల్లెకి చెందిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ కాజేసి.. అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు చోరీ చేశాడు. అయితే బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిత్యం వందల మంది రోగులు వచ్చే రుయా ఆస్పత్రిలో నకిలీ వైద్యుడు దొంగ వేషంలో తిరుగుతూ ఉండటంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.