తిరుపతిలో రూ.500 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం కానుంది. తిరుమల ఆలయాన్ని ప్రతిబింబించేలా దీని డిజైన్ ఉంటుంది. మొత్తం 10 అంతస్తుల్లో నిర్మితమయ్యే ఈ భవనంలో బస్టాండ్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఇందులో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థలాన్ని ఇవ్వనుండగా, కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్టుబడి పెడుతుంది. ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్‌కు స్కైవాక్ నిర్మించాలని యోచిస్తున్నారు.