Tollywood: రాష్ట్రంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారినే నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ, తెలంగాణ ప్రభుత్వం మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇక ఈ చర్చలకు ప్రొడ్యూసర్ దిల్ రాజు మధ్యవర్తిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరుకానుండగా.. సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు ప్రభుత్వం వైపు ఉండనున్నారు.