TRS అధినేత్రి కవిత వెనుక కాంగ్రెస్.. ప్రజలకు సమాధానం దొరికింది: TRP

55 minutes ago 5
తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవితను కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌ రెడ్డి నడిపిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆరోపించింది. కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో కవిత నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ ఏర్పాట్లు, జన సమీకరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర ఉందని టీఆర్‌పీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కవిత సభకు చేరుకున్న బస్సు కూడా కాంగ్రెస్‌ నేతకు చెందిన సంస్థదేనని ఆరోపిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్‌, రేవంత్‌రెడ్డి వర్గాల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉండగా.. బస్సు వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article