తిరుపతి లడ్డూ వివాదం ఓ కట్టుకథగా మాజీ సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. వంద రోజుల పాలనపై ప్రజలు ప్రశ్నిస్తారనే కారణంతోనే సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో నెయ్యి నాణ్యత పరీక్ష విధానాలను ఎవరూ మార్చలేదన్న జగన్.. మూడుసార్లు పరీక్షించిన తర్వాతే ట్యాంకర్లను టీటీడీ అనుమతిస్తుందన్నారు. చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఎన్‌డీడీబీ నుంచి నెయ్యి నాణ్యతపై రిపోర్టు జులై 23న వస్తే ఇన్ని రోజులూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.