టీటీడీ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు.. తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులను వరుసగా కలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డిని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన బీఆర్ నాయుడు.. తాజాగా హరీష్ రావును కూడా కలిశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ నాయుడుకి హరీష్ రావు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. హరీష్ రావు విజ్ఞప్తికి బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.