TTD: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు రోజువారీగా అందిస్తున్న టికెట్లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన కోటాను రెట్టింపు చేస్తూ టీటీడీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతనెలలో రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ నుంచి వచ్చిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.